Kalyani Priyadarshan: అందమైన అమ్మాయికి సూపర్ పవర్స్ .. ఓటీటీకి 'కొత్త లోక'!
- మలయాళంలో 'లోక 1: చంద్ర'
- తెలుగు ప్రేక్షకుల ముందుకు 'కొత్త లోక'
- ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్
- జియో హాట్ స్టార్ ద్వారా అందుబాటులోకి
ఈ మధ్య కాలంలో మలయాళంలో వచ్చిన ఒక సినిమాను గురించి ఆడియన్స్ ఎక్కువగా మాట్లాడుకున్నారు. సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. మలయాళంలో ఇంతవరకూ వచ్చిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలను వసూళ్ల పరంగా ఈ సినిమా బీట్ చేసింది. కేవలం 30 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 300 కోట్ల వసూళ్లను రాబట్టడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇన్నేసి విన్యాసాలు చేసిన ఆ సినిమా పేరే 'లోక 1:చంద్ర'. తెలుగులో 'కొత్త లోక 1: చంద్ర'గా సెట్ చేశారు.
కల్యాణి ప్రియదర్శన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమాలో, నెస్లెన్ .. శాండీ మాస్టర్ .. అరుణ్ కురియన్ .. చందూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఆగస్టు 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, సంచలన విజయాన్ని నమోదు చేసింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 20వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది.
కథలోకి వెళితే .. చంద్ర అనే యువతి బెంగుళూర్ లోని ఒక ఇంట్లో అద్దెకి ఉంటూ ఒక హోటల్లో జాబ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇంటికి ఎదురుగుండా ఉన్న ఇంట్లో 'సన్నీ' ఉంటాడు. అతనికి చంద్ర ధోరణి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అప్పటి నుంచి ఆమెను రహస్యంగా గమనించడం మొదలుపెడతాడు. ఆమె దగ్గర సూపర్ పవర్స్ ఉన్నాయనే విషయం అతనికి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ తరువాత జరిగేదేమిటి? అనేది కథ.