ఈ వారం ఓటీటీలో కొత్త తెలుగు సినిమాలు, సిరీస్‌లు ఇవే

  • ఈ వారం ఓటీటీలో భారీ వినోద వర్షం!
  • స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలపై రిలీజ్‌కు రెడీ అయిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు 
  • సన్ నెక్ట్స్‌లో అక్టోబర్ 10న మిరాయ్, త్రిభాణదారి బార్బరిక్
సినీ ప్రియులు, సిరీస్ అభిమానుల కోసం ఓటీటీ వేదికలు మరోసారి వినోదాల విందును సిద్ధం చేశాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, సన్ నెక్స్ట్, ఆహా వంటి ప్రముఖ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లు అక్టోబర్ 7 నుంచి 12 మధ్య పలు విభిన్న తరహా సినిమాలు, సిరీస్‌లను విడుదల చేస్తున్నాయి.

ఈ వారంలో థ్రిల్లింగ్ క్రైమ్ డ్రామాల నుంచి కామెడీ, హారర్, రొమాన్స్ వరకు విభిన్నమైన జానర్లలో కంటెంట్ లభించనుంది. తెలుగు స్ట్రెయిట్ కంటెంట్ పరంగా మాత్రం మిరాయ్, త్రిభాణదారి భార్బరిక్ చిత్రాలు ప్రధానంగా నిలిచాయి. మిగతావన్నీ అనువాద చిత్రాలు, అంతర్జాతీయ కంటెంట్ అధికంగా ఉన్నాయి.

అక్టోబర్ 7–12 వరకు విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల పూర్తి జాబితా:

సన్ నెక్స్ట్
ట్రిభాణధారి భార్బరిక్ (తెలుగు + తమిళం) – అక్టోబర్ 10
రాంబో (తమిళం) – అక్టోబర్ 10 (అనువాదం)
జీ 5
వెదువన్ (తమిళం) (వెబ్ సిరీస్) – అక్టోబర్ 10
జియో హాట్‌స్టార్
మిరాయ్ (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) – అక్టోబర్ 10
సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ (హిందీ) (వెబ్ సిరీస్) – అక్టోబర్ 10

అమెజాన్ ప్రైమ్ వీడియోస్
హిమ్, క్లోడ్, ఎ లిటిల్ ప్రేయర్, ఫ్రీకియర్ ఫ్రైడే, బాల్టిమోరాన్స్ – అక్టోబర్ 7
మెయింటెనెన్స్ రిక్వైర్డ్ – అక్టోబర్ 8

నెట్‌ఫ్లిక్స్
ట్రూ హాంటింగ్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 7
కార్మెలో (బ్రెజిలియన్) – అక్టోబర్ 8
నెరో: ది అసాసిన్ (ఫ్రెంచ్) – అక్టోబర్ 8
ఇజ్ ఇట్ కేక్? హాలోవీన్ స్పెషల్ – అక్టోబర్ 8
బూట్స్ (ఇంగ్లీష్) – అక్టోబర్ 9
డెండామ్ మలం కెలాం (ఇండోనేషియన్) – అక్టోబర్ 9
ది రెసరెక్టెడ్ (తైవానీస్) – అక్టోబర్ 9
ఓల్డ్ మనీ (టర్కిష్) – అక్టోబర్ 10
ది ఉమెన్ ఇన్ కాబిన్ 10 (ఇంగ్లీష్) – అక్టోబర్ 10
ది చోసన్: సీజన్ 5 – అక్టోబర్ 10
కురుక్షేత్ర (హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ) – అక్టోబర్ 10
డాక్టర్ సూస్ హార్టన్ (యానిమేటెడ్) – అక్టోబర్ 10
మర్తబత్: మిసి బెర్దారహ్ (మలేసియన్) – అక్టోబర్ 12 


More Telugu News