: ఐరాస బకాయిల చెల్లింపులో భారత్ రికార్డ్
- ఐక్యరాజ్యసమితి 'ఆనర్ రోల్'లో భారత్
- ఆర్థిక సంక్షోభంలో ఐరాసకు అండగా న్యూఢిల్లీ
- ముప్పై రోజుల్లోపే నిధుల జమ పూర్తి
- స్టాట్యూ ఆఫ్ యూనిటీ క్విజ్‌తో గుర్తింపు
అంతర్జాతీయ వేదికపై భారత్ మరోసారి తన బాధ్యతాయుతమైన వైఖరిని చాటుకుంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఐక్యరాజ్యసమితిని ఆదుకునేందుకు తన 2026 ఏడాది బకాయిలను భారత్ సకాలంలో చెల్లించింది. మొత్తం 35.187 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 290 కోట్లు) జమ చేయడం ద్వారా ఐరాస ప్రకటించే ప్రతిష్టాత్మక 'ఆనర్ రోల్' జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది.
అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాలే తమ వాటా నిధులను సకాలంలో చెల్లించక ఐరాస 'ఆర్థిక పతనం' అంచున ఉన్నట్లు సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ హెచ్చరిస్తున్న తరుణంలో భారత్ ముందుండి నిధులు విడుదల చేయడం విశేషం. ఐరాస నిబంధనల ప్రకారం.. నోటీసు అందిన 30 రోజుల్లోపు పూర్తి నిధులు చెల్లించే దేశాలనే ఈ 'ఆనర్ రోల్'లో చేరుస్తారు. ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 47 దేశాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి.
ఈ సందర్భంగా ఐరాస ప్రతినిధి స్టెఫాన్ దుజారిక్ విలేకరులతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన క్విజ్ నిర్వహించారు. "ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) ఉన్న దేశం ఏది?" అని ప్రశ్నించి భారత్ తన బకాయిలను పూర్తిగా చెల్లించిందని ప్రకటించారు. గతంలో ఆంటోనియో గుటెర్రస్ గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించిన సంగతిని కూడా ఆయన గుర్తుచేశారు. శాంతి స్థాపన బడ్జెట్‌తో సంబంధం లేకుండా, ఐరాస రోజువారీ కార్యకలాపాల కోసం భారత్ తన వంతుగా 1.016 శాతం నిధులను కేటాయిస్తోంది.