హైదరాబాద్‌లో డీసీఎంలో మంటలు.. మద్యం బాటిళ్ల కోసం ఎగబడిన స్థానికులు

హైదరాబాద్‌ నగరంలోని హబ్సిగూడలో మద్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనంలో అగ్నిప్రమాదం సంభవించింది. వాహనంలో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపివేశాడు. స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో పలు మద్యం సీసాలు పాక్షికంగా కాలిపోయాయి.

మద్యం సీసాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో, వాటిని తీసుకునేందుకు స్థానికులు ఎగబడ్డారు. మద్యం సీసాలు పడిపోయిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సంఘటన స్థలానికి పరుగులు తీశారు. ఈ సంఘటనతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Hyderabad Fire Accident
Hyderabad
Fire accident
Habsiguda
Liquor bottles
DCM
Local residents
Telangana

More Telugu News