ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకున్న అవికా గోర్
- సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని వివాహం చేసుకున్న అవికా గోర్
- సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన అవికా గోర్
- వివాహ వేడుక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్
- శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు, సినీ ప్రముఖులు
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పేరుగాంచిన నటి అవికా గోర్ కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉన్న సామాజిక కార్యకర్త మిలింద్ చంద్వానిని వివాహం చేసుకున్నారు. ఇదివరకే జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు అవికా–మిలింద్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఐదేళ్ల ప్రేమ, ఒక్కటైన హృదయాలు
అవికా – మిలింద్ ప్రేమ కథ 2019లో ప్రారంభమైంది. ఓ సామాజిక కార్యక్రమంలో కలుసుకున్న వీరిద్దరూ మొదట స్నేహితులుగా ఉండి, ఆపై 2020 నుంచి ప్రేమాయణం కొనసాగించారు. దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం కొనసాగించిన ఈ జంట, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
సీరియల్ నటిగా కేరీర్ మొదలు
సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన అవికా.. బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు. ఆమె తొలి తెలుగు చిత్రం ‘ఉయ్యాలా జంపాలా’ (2013)తో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మామ’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘థ్యాంక్యూ’ వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ‘షణ్ముఖ్’ అనే తెలుగు చిత్రంలో అవికా నటిస్తున్నారు.
సింపుల్ వెడ్డింగ్, సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం
అతి దగ్గరి బంధువుల సమక్షంలో వివాహం ఎంతో నిరాడంబరంగా జరిగింది. ఫోటోలు, వీడియోల ద్వారా వీరి ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అవికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో, “ఇది నిజమైన ప్రేమ. మిమ్మల్ని అందరినీ కలిపి చూసుకోవాలని ఉంది. నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తితో జీవితం మొదలుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు.