జీఎస్టీ సంస్కరణలపై స్పందించిన సీఐఐ వెస్టర్న్ రీజియన్ అధ్యక్షుడు బాగ్లా

  • జీఎస్టీ సంస్కరణలు పరిశ్రమలకు పన్ను దాఖలును సరళీకృతం చేశాయన్న బాగ్లా
  • కొత్త చట్టం కింద ప్రభుత్వం రెండు ప్రధాన మార్పులను చేపట్టిందని వెల్లడి
  • భారత ఆర్థిక వ్యవస్థ వేగంవంతమైన వృద్ధి పథంలో ఉందని వ్యాఖ్య
ఇటీవలి జీఎస్టీ సంస్కరణలు పరిశ్రమలకు పన్ను దాఖలును సరళీకృతం చేశాయని, తద్వారా దేశంలో వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) పశ్చిమ ప్రాంత అధ్యక్షుడు రిషి కుమార్ బాగ్లా గురువారం పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సు సందర్భంగా ఆయన ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ, నూతన విధానం కింద ప్రభుత్వం రెండు ప్రధాన మార్పులు చేపట్టిందని బాగ్లా గుర్తు చేశారు.

"మొదటిది, పన్ను శ్లాబులను రెండుకి తగ్గించారు. దీనివల్ల వస్తువులు గణనీయంగా చౌకగా మారడంతో పాటు వినియోగదారులకు మరింత అందుబాటులోకి వచ్చాయి. రెండవది, జీఎస్టీ 2.0లో ప్రభుత్వం పరోక్ష పన్ను వ్యవస్థను మరింత సరళీకృతం చేసింది. ఇది పన్ను దాఖలును సులభతరం చేయడంతో పాటు వ్యాపార సౌలభ్యాన్ని ప్రోత్సహిస్తుంది" అని ఆయన అన్నారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగవంతమైన వృద్ధి పథంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రహదారులు, విమానాశ్రయాలు, గ్రామీణ ప్రాంతాల అనుసంధానం వంటి మౌలిక సదుపాయాలలో ప్రభుత్వం పెట్టుబడులను పెంచుతోందని బాగ్లా తెలిపారు. ఇది ఉపాధిని పెంచడంతో పాటు ఆర్థిక వనరులను సృష్టిస్తుందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News