ఈ గెస్ట్ ఇల్లు విడిచి వెళ్లొద్దు... గ్యాస్ సిలిండర్‌పై సమీరారెడ్డి ఫన్నీ పోస్ట్

Sameera Reddy Funny Post on Gas Cylinder Shortage
  • గ్యాస్ కొరతపై నటి సమీరా రెడ్డి సరదా వీడియో
  • సిలిండర్‌కు 'కింగ్ గ్యాస్' అంటూ కిరీటం, రాచమర్యాదలు
  • గ్యాస్ సంక్షోభం ప్రతిబింబించేలా తన పోస్టుకు ఫన్నీ క్యాప్షన్
దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రముఖ నటి సమీరా రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌కు రాచమర్యాదలు చేస్తూ ఆమె పోస్ట్ చేసిన ఓ సరదా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన ప్రస్తుత పరిస్థితులపై ఆమె ఈ సెటైరికల్ వీడియో చేశారు.

ఈ వీడియోలో, సమీరా రెడ్డి తన ఇంటికి వచ్చిన గ్యాస్ సిలిండర్‌కు అపూర్వ స్వాగతం పలికారు. దానికి 'కింగ్ గ్యాస్' అని రాసి ఉన్న కిరీటం పెట్టి, డబ్బులతో విసనకర్ర ఊపుతూ, టీ, పూలు అందిస్తూ, చివరకు దానితో సెల్ఫీ కూడా దిగారు. "ఈ అతిథి ఎప్పటికీ నా ఇంటిని విడిచి వెళ్లకుండా చూసుకుంటున్నా" అంటూ ఫన్నీ క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేక, కామెంట్ సెక్షన్‌లో లాఫింగ్ ఎమోజీలతో నింపేశారు.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సమీరా రెడ్డి, సోషల్ మీడియాలో ఇలాంటి సరదా పోస్టులతో తన అభిమానులను అలరిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సమీరా రెడ్డికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్, 2004లో తాను తీసిన 'మై హూ నా' చిత్రంలో సుస్మితా సేన్ పోషించిన 'మిస్ చాందిని' పాత్రకు మొదట సమీరా రెడ్డినే అనుకున్నట్లు వెల్లడించారు. 'అహిస్తా' అనే మ్యూజిక్ వీడియోలో సమీరాను చూసి ఆ పాత్రకు ఎంపిక చేయాలనుకున్నానని, కానీ అప్పటికే ఆమె 'మైనే దిల్ తుఝ్‌కో దియా' సినిమాకు కమిట్ అవ్వడంతో ఆ అవకాశం చేజారిందని ఫరా తెలిపారు. ఈ విషయం తెలిసి సమీరా ఆశ్చర్యపోయారు.


Go Back to Shorts
Sameera Reddy
Gas cylinder crisis
LPG shortage India
Farah Khan
Main Hoon Na
Sushmita Sen
Bollywood actress
Social media post
Ahista song
Entertainment news

More Telugu News