అభిషేక్ శర్మ మెరుపులు.. అయినా తడబడిన భారత్.. బంగ్లా టార్గెట్ 169
- ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ
- మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్ శర్మ
- 37 బంతుల్లో 75 రన్స్‌తో రప్ఫాడించిన యువ ఓపెనర్
- నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసిన టీమిండియా
- టీ20ల్లో 150 వికెట్లు తీసిన తొలి బంగ్లా బౌలర్‌గా ముస్తాఫిజుర్ రికార్డు
అయితే, అభిషేక్ ఔటయ్యాక భారత ఇన్నింగ్స్ ఒక్కసారిగా నెమ్మదించింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడంతో పరుగుల వేగం తగ్గింది. ఈ క్రమంలోనే జట్టు ఐదు వికెట్లు కోల్పోయినా, సంజూ శాంసన్‌ను బ్యాటింగ్‌కు పంపాలన్న ఆలోచన జట్టు యాజమాన్యం చేయలేదు. చివరలో హార్దిక్ బ్యాట్ ఝుళిపించడంతో భారత జట్టు మోస్తరు స్కోర్ చేయగలిగింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుతమైన ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచడంలో భారత్ విఫలమైంది.
ఇదే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్లు పడగొట్టిన తొలి బంగ్లాదేశ్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా, ఫైనల్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా 169 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాల్సి ఉంది.