వారికి మాత్రమే రూ. 5కే చొక్కా ఆఫర్.. దుకాణం ముందు యువత బారులు

  • కొడంగల్ పట్టణంలోని ఓ వస్త్ర వ్యాపారి ఆఫర్
  • తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లకు తక్కువ ధరకే ఇస్తానని ప్రకటన
  • వస్త్ర దుకాణం ముందు బారులు తీరిన యువత
  • దుకాణం తెరిచి దుస్తులు అందించిన వ్యాపారి
నారాయణపేట జిల్లా, కొడంగల్ పట్టణంలోని ఓ వస్త్ర దుకాణం సంచలన ఆఫర్ ప్రకటించడంతో ప్రజలు పోటెత్తారు. కేవలం రూ. 5కే చొక్కా అందిస్తామని ప్రకటించడంతో దుకాణం ముందు బారులు తీరారు. అయితే, ఈ ఆఫర్ అందరికీ వర్తించదని దుకాణ యజమాని తెలిపారు. కొడంగల్ బస్టాండ్ వద్ద ఉన్న వస్త్ర దుకాణ యజమాని తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల కోసం ప్రత్యేకంగా ఈ ఆఫర్ ప్రకటించారు.

దీంతో తెల్లవారుజాము నుంచే యువకులు భారీ సంఖ్యలో దుకాణం వద్దకు చేరుకున్నారు. వందలాది మంది దాదాపు రెండు గంటల పాటు దుకాణం ముందు వరుసలో నిలుచున్నారు. జనం అధిక సంఖ్యలో రావడంతో దుకాణం తెరవడం యజమానికి కష్టతరంగా మారింది. చివరకు దుకాణం తెరిచి, వచ్చిన వారికి దుస్తులను అందించారు.


More Telugu News