అమెజాన్ బిగ్ ఆఫర్ .. వన్‌ప్లస్ 13పై భారీ డిస్కౌంట్

  • ఈ నెల 23 నుంచి అమెజాన్ వార్షిక సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్
  • అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే ఆఫర్లు
  • స్మార్ట్ ఫోన్ల ధరల తగ్గింపును ప్రకటించిన అమెజాన్
ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తన ప్రతిష్ఠాత్మక వార్షిక సేల్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పండుగల సీజన్‌ను పురస్కరించుకుని నిర్వహించే ఈ భారీ విక్రయోత్సవంలో స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, హోమ్‌ అప్లయెన్సులు, వేర్‌బుల్‌ డివైసులు సహా ఎన్నో ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందించనున్నారు.

అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు ఈ ఆఫర్లు ఒక రోజు ముందుగానే అంటే సెప్టెంబర్‌ 22 నుంచే లభ్యం కానున్నాయి. సేల్‌ ప్రారంభానికి ముందు నుంచే సంస్థ కొన్ని ప్రత్యేక డీల్స్‌ను వెల్లడిస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ వన్‌ప్లస్‌ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లపై గణనీయమైన ధర తగ్గింపును ప్రకటించింది.

ఈ ఏడాది జనవరిలో రూ.69,999 ధరకు విడుదలైన వన్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ ఫోన్‌ను ఈ సేల్‌లో కేవలం రూ.57,999కు పొందవచ్చని అమెజాన్‌ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్‌, డెబిట్‌ కార్డులపై లభించే తగ్గింపుతో కలిపి ఈ స్పెషల్‌ ధరను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదే కాకుండా, వన్‌ప్లస్‌ 13 మోడల్‌తో పాటు ఇతర మోడళ్లపై కూడా డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.

కొన్ని వారాల క్రితం రూ.54,999కు మార్కెట్‌లోకి వచ్చిన వన్‌ప్లస్‌ 13ఎస్‌ను ఇప్పుడు రూ.47,999కు కొనుగోలు చేయొచ్చు. అలాగే మిడ్రేంజ్‌ కేటగిరీలోని వన్‌ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లు కూడా తగ్గింపు ధరలకే అందుబాటులో ఉంటాయి.

వాటిలో:
వన్‌ప్లస్‌ నార్డ్‌ 5 – రూ.28,749
వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 – రూ.25,499
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 – రూ.18,499
వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్ – రూ.15,999
ఈ ధరలు ఎస్‌బీఐ బ్యాంక్‌ కార్డులపై లభించే అదనపు డిస్కౌంట్లను కలుపుకొని నిర్ణయించబడ్డాయని అమెజాన్‌ స్పష్టం చేసింది. 


More Telugu News