భారత నూతన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కు అభినందనలు: నారా లోకేశ్
భారత నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ఏపీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాధాకృష్ణన్ ఎన్నిక పట్ల హర్షం వ్యక్తం చేసిన లోకేశ్, ఆయన సేవలను కొనియాడారు.
ప్రజాసేవలో సీపీ రాధాకృష్ణన్‌కు ఉన్న అపారమైన అనుభవం, ఆయన రాజనీతిజ్ఞత దేశానికి ఎంతగానో మేలు చేస్తాయని నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రజాసేవ పట్ల ఆయనకున్న నిబద్ధత ఎంతో గొప్పదని ప్రశంసించారు. ఆయన తన పదవీకాలంలో వివేకం, గౌరవంతో ప్రజలకు విజయవంతంగా సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. రాధాకృష్ణన్ నాయకత్వంలో దేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.