Manchu Manoj: ఆట, పాట... మరియు ఓ మంచి మాట: మంచు మనోజ్

Manchu Manoj Fun Cricket and Mirai Promotion
షార్ట్స్‌లో చూడండి
విలక్షణ నటుడు మంచు మనోజ్ ఓ శక్తివంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న 'మిరాయ్' చిత్రంలో ఆయన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా మనోజ్ సోషల్ మీడియాలో పంచుకున్న ఓ వీడియో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిల్లలతో కలిసి ఆయన సరదాగా క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

ఈ వీడియోను ట్వీట్ చేస్తూ, సినిమా ప్రమోషన్ల కోసం వైజాగ్‌కు వస్తున్నట్లు మనోజ్ ప్రకటించారు. "ఇవాళ సండే కదా... క్రికెట్ ఆడుతున్నాం. దాంతో పాటే బ్లాక్ స్వోర్డ్ ఇన్విటేషన్ కూడా! వైజాగ్... సిద్ధం ఉన్నారా... రేపు వచ్చేస్తున్నాం. ఆట, పాట.. మరియు ఓ మంచి మాట" అంటూ తనదైన శైలిలో అభిమానులకు సందేశమిచ్చారు. ఈ ట్వీట్‌తో సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'మిరాయ్' చిత్రంలో మనోజ్ 'బ్లాక్ స్వోర్డ్' అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తుండగా, సీనియర్ నటి శ్రియ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతలు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Go Back to Shorts
Manchu Manoj
Mirai movie
Teja Sajja
Black Sword
Telugu cinema
Vizag
Shriya
Fantasy action thriller
Movie promotions

More Telugu News