పార్టీ అధినేత కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ

  • ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో సమావేశమైన ఎమ్మెల్యే
  • హాజరైన కేటీఆర్, పలువురు పార్టీ ప్రముఖులు
  • కవిత రాజీనామా సహా వివిధ అంశాలపై చర్చ
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుతో మాజీ మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లిన హరీశ్ రావు పార్టీ అధినేతను కలిశారు. అప్పటికే కేటీఆర్ సహా పలువురు పార్టీ ప్రముఖులు అక్కడ ఉన్నారు.

ఇటీవల అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తును సీబీఐకి అప్పగించడం, ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేయడం వంటి అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల హరీశ్ రావుపై కవిత సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే.

నాపై కావాలని దుష్ప్రచారం

తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తన రాజకీయ జీవితం తెలంగాణ ప్రజల ముందు తెరిచిన పుస్తకంలాంటిదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తన నిబద్ధత అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.


More Telugu News