పీటీ వారెంట్.. అంబటిని రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్న పోలీసులు
- పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కేసు
- అంబటిపై కేసు నమోదు చేసిన పట్టాభిపురం పీఎస్ పోలీసులు
- పీటీ వారెంట్ పై నేడు తీర్పును వెలువరించనున్న గుంటూరు కోర్టు
ఈ కేసుకు సంబంధించి అంబటిని విచారించేందుకు పట్టాభిపురం పీఎస్ పోలీసులు గుంటూరు కోర్టులో నిన్న పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ వారెంట్ పై కోర్టు ఈరోజు తీర్పును వెలువరించనుంది. అంబటిపై మరిన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అన్ని కేసుల్లో ఆయనపై పీటీ వారెంట్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
మరోవైపు, చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో గుంటూరు కోర్టులో అంబటి బెయిల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. దీనికి తోడు అంబటి పోలీస్ కస్టడీ పిటిషన్, రాజమండ్రి సెంట్రల్ జైల్లో అదనపు సౌకర్యాల కోసం వేసిన పిటిషన్లపై కూడా ఈరోజు విచారణ జరగనుంది. అంబటికి సంబంధించిన నాలుగు పిటిషన్లపై విచారణ ఉండటంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకు తరలిస్తున్నారు.