'ఘాటి' హైలైట్స్ ఇవేనా?
- రేపు విడుదలవుతున్న 'ఘాటి'
- కొత్త లుక్ తో కనిపించనున్న అనుష్క
- పవర్ఫుల్ పాత్రలో అనుష్క విశ్వరూపం
- డైలాగ్స్ - లొకేషన్స్ హైలైట్
- కొత్త రికార్డులు ఖాయమంటున్న ఫ్యాన్స్
అనుష్క ప్రధానమైన పాత్రగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఘాటి' సిద్ధమవుతోంది. రేపు భారీ స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆరంభం నుంచే అంచనాలు పెంచుతూ వెళుతోంది. అందుకు ప్రధానమైన కారణం అనుష్క. చాలా గ్యాప్ తరువాత ఆమె ఈ సినిమా చేస్తుండటంతో అందరిలోను ఆసక్తిని పెంచుతోంది. కథలో బలమైన అంశమేదో ఉండటం వల్లనే ఆమె అంగీకరించి ఉంటుందని భావిస్తున్నారు.
'అరుంధతి' తరువాత అనుష్క నాయిక ప్రధానమైన సినిమాలు చేసింది. అయితే ఆ సినిమా స్థాయిలో అనుష్క మిగతా సినిమాలలో అంత పవర్ఫుల్ గా కనిపించలేదు. హారర్ .. సస్పెన్స్ .. కామెడీ టచ్ తోనే ఆ సినిమాలు సాగాయి. అందువలన 'అరుంధతి' వంటి ఒక గంభీరమైన పాత్రలో ఆమెను చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటి ఈ సమయంలోనే ఆమె 'ఘాటి' సినిమాను చేసింది. పోస్టర్స్ నుంచే అభిమానులను ఖుషీ చేసిన సినిమా ఇది.
'ఘాటి' అనే టైటిల్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. 'ఘాటి' అని ఎవరిని అంటారనేది క్రిష్ క్లారిటీ ఇచ్చిన తరువాత మరింత కనెక్ట్ అయింది. అనుష్క డిఫరెంట్ లుక్ .. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా కనిపించడం .. అందుకు తగిన డైలాగ్ డెలివరీ .. యాక్షన్ సీన్స్ .. లొకేషన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అనిపిస్తోంది. చాలా కాలం తరువాత అనుష్కను తాము అనుకున్నటు వంటి పాత్రలో చూడబోతున్నందుకు అభిమానులు హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా కొత్త రికార్డులను కొల్లగొడుతుందేమో చూడాలి మరి.