సెట్లోనే కన్నీళ్లు పెట్టుకున్న శోభన్ బాబు!
- కోడి రామకృష్ణ దగ్గర పనిచేశానన్న దేవిప్రసాద్
- 'ఆస్తి మూరెడు ఆశ బారెడు' గురించిన ప్రస్తావన
- ఆ సీన్ చెప్పగానే శోభన్ బాబు ఎమోషనల్ అయ్యారట
- ఆయన ఎన్నో కష్టాలు పడ్డారని వెల్లడి
తెలుగు తెర అందాల నటుడిగా శోభన్ బాబుకి అప్పట్లో ఒక రేంజ్ లో క్రేజ్ ఉండేది. మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలను ఆ స్థాయిలో అందుకున్న కథానాయకుడు శోభన్ బాబుకి ముందుగానీ .. ఆ తరువాత గానీ ఎవరూ లేరు. అందుకే శోభన్ బాబు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఎప్పటికీ కనిపిస్తూనే వచ్చారు. ఆయన సినిమాలను వదలకుండా చూసే అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. దర్శకుడు దేవీప్రసాద్ ' తెలుగు వన్' వారితో మాట్లాడుతూ, శోభన్ బాబు గురించి ప్రస్తావించారు.
"నేను కోడి రామకృష్ణగారి దగ్గర పనిచేశాను. ఆయన శోభన్ బాబుగారితో 'ఆస్తి మూరెడు ఆశ బారెడు' సినిమాను తీశారు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. షూటింగ్ గ్యాప్ లో కోడ్ రామకృష్ణగారు .. శోభన్ బాబుగారు మాట్లాడుకుంటూ ఉంటే నేను అక్కడే ఉండి వినేవాడిని. ఆ సినిమాలో హీరో .. హీరోయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్లు .. కష్టాల్లో ఉంటారు. ఇద్దరూ కూడా ఆ నెలను ఎలా నెట్టుకు రావాలి? ఏయే ఖర్చులు తగ్గించాలి? అనేది లిస్టు రాసుకునే సీన్ అది. ఆ సీన్ గురించి చెప్పగానే శోభన్ బాబుగారు కన్నీళ్లు పెట్టుకున్నారు" అని అన్నారు.
"శోభన్ బాబుగారు ఎమోషనల్ కావడం చూసి మేము ఆశ్చర్యపోయాం. సినిమాలలో వేషాలు అంతగా లేనప్పుడు, తన జీవితంలోను అచ్చు అలాగే జరిగిందని శోభన్ బాబు చెప్పారు. తాను .. తన భార్య అలాగే ఆ నెలలో ఖర్చులు తగ్గించడం గురించి మాట్లాడుకునే వాళ్లమని అన్నారు. ఒకసారి ఇంటి రెంట్ కట్టలేదని చెప్పి, ఓనర్ వచ్చి ఫ్యూజ్ తీసుకుని వెళ్లిపోయాడట. భార్య భర్తలు ఇద్దరూ కలిసి కొడుక్కి తెల్లవార్లు విసురుతూ కూర్చున్నట్టుగా ఆయన చెప్పారు. కోడి రామకృష్ణగారిలోని సహనాన్ని ఆయన ఎక్కువగా మెచ్చుకునేవారు" అని అన్నారు.