Nandamuri Balakrishna: మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును ప్రారంభించి... స్వయంగా నడిపిన బాలయ్య
- బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఘనంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమం
- దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని 2007లో వాజ్‌పాయ్ చేతుల మీదుగా ప్రారంభించామన్న బాలకృష్ణ
- ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని వెల్లడి
బసవతారకం ఇండో - అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ ఆస్పత్రిలో బ్రాకీథెరపీ యూనిట్, రెండు ఆపరేషన్ థియేటర్లు, మోల్డ్ రూమ్స్, అదనపు క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ వాహనాన్ని ప్రారంభించారు. మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును బాలకృష్ణ స్వయంగా నడిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ 2007లో దేశంలోనే తొలిసారిగా క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ వాహనాన్ని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేతుల మీదుగా ఆవిష్కరించారని తెలిపారు.
ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని.. ఈ ఏడాది మాత్రమే ఇప్పటికే 56 వేలకుపైగా పరీక్షలు చేసినట్లు బాలకృష్ణ వెల్లడించారు. మామోగ్రఫీతో పాటు అన్ని రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను మొబైల్ వాహనంలో నిర్వహిస్తున్నామని చెప్పారు. స్క్రీనింగ్ తర్వాత అవసరమైన వారికి ఆస్పత్రికి తీసుకొని వచ్చి చికిత్స అందిస్తున్నామని వివరించారు. నాన్న నందమూరి తారక రామారావు ఆదేశాల మేరకు ఆస్పత్రిలో అన్ని రకాల సేవలు అందిస్తూ రోగులకు ఓదార్పునిస్తున్నామని తెలిపారు.
ఆస్పత్రిలో అందరికీ సమానంగా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. రోగుల కోసం ఆధునాతన వైద్య పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. క్యాన్సర్ గురించి సులభంగా అర్ధమయ్యేలా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు. మొబైల్ వాహనంలో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దాన్ని స్కాన్ చేస్తే క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన కల్గించే సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. సీఎంఐ ప్రోగ్రాం ద్వారా రోగులకు ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. ఆస్పత్రికి వీల్‌చైర్లను వితరణగా అందజేసినందుకు సాంబశివరావుకు ఈ సందర్భంగా బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.