Raj B Shetty: 5 కోట్లతో 115 కోట్లు తెచ్చిన సినిమా .. త్వరలో ఓటీటీకి!
- కన్నడలో రూపొందిన కామెడీ కంటెంట్
- ముఖ్యమైన పాత్రలో నటించిన రాజ్ బి శెట్టి
- వసూళ్ల పరంగా కొత్త రికార్డ్
- వచ్చేనెల 5 నుంచి జియో హాట్ స్టార్ కి వచ్చే ఛాన్స్
సాధారణంగా మలయాళ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లో రూపొందుతూ ఉంటాయి. కంటెంట్ ఏ మాత్రం కనెక్ట్ అయినా వసూళ్లు వందల కోట్లకు వెళ్లిపోతూ ఉంటాయి. అయితే అలాంటి ఒక మేజిక్ రీసెంటుగా ఒక కన్నడ సినిమా విషయంలో జరిగింది. ఆ సినిమా పేరే 'సు ఫ్రమ్ సో'. తుమినాడ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో 'రాజ్ బి శెట్టి ఒక నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించాడు. ఒక ముఖ్యమైన పాత్రను సైతం పోషించాడు.
ఈ ఏడాది జులై 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. కేవలం ఐదున్నర కోట్లతో నిర్మించిన ఈ సినిమాకి, అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా, జనంలోకి దూసుకుపోయింది. కేవలం కన్నడలోనే ఈ సినిమా 75 కోట్ల నెట్ ను వసూలు చేసింది. లాంగ్ రన్ పూర్తయ్యే సమయానికి ఈ సినిమా 115 కోట్లను రాబట్టగలిగింది. ఈ ఏడాదిలో చిన్న సినిమా సాధించిన పెద్ద విజయంగా ఇది రికార్డును నమోదు చేసింది.
అలాంటి ఈ సినిమా ఈ నెల 5వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ కానున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన రావలసి ఉంది. అశోక్ అనే కుర్రాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని కలుసుకోవడానికి ఆమె ఊరు వెళతాడు. ఆ ఊళ్లో వాళ్లకి దొరికిపోయే సమయం వచ్చేసరికి, తనకి దెయ్యం పట్టిందని అబద్ధం చెబుతాడు. ఆ అబద్ధం వలన అతను ఎలాంటి తంటాలు పడ్డాడనేది కథ.