కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడి ఆత్మహత్య
- ఖమ్మం వద్ద రైలు కింద పడి చంద్రశేఖరరెడ్డి మృతి
- ఒంటరితనమే కారణమని ప్రాథమిక నిర్ధారణ
- రెండు వారాల క్రితమే వృద్ధాశ్రమం ఖాళీ చేసిన వైనం
- కాశీ నుంచి నెల్లూరు వెళుతూ ఖమ్మంలో ఆత్మహత్య
ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, సీపీఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పుచ్చలపల్లి సుందరయ్య మేనల్లుడు దువ్వూరు చంద్రశేఖరరెడ్డి (77) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. నిన్న తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఖమ్మం రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన చంద్రశేఖరరెడ్డి ఖమ్మం సమీపంలో గరీభ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. తీవ్రమైన ఒంటరితనమే ఆయనను ఈ దారుణ నిర్ణయం వైపు నడిపించిందని భావిస్తున్నారు. సుమారు 25 ఏళ్ల క్రితమే ఆయన భార్య మరణించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారు అమెరికాలో స్థిరపడ్డారు. దీంతో ఆయన ఒంటరిగా జీవిస్తూ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో చేరారు.
అయితే, 15 రోజుల క్రితం ఆయన ఆ వృద్ధాశ్రమాన్ని ఖాళీ చేసి కాశీ యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరిగి నెల్లూరు వెళుతున్నట్టు మంగళవారం తనకు మనుమడు వరసయ్యే వ్యక్తికి ఆయన ఫోన్‌లో తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఖమ్మం రైల్వేస్టేషన్‌లో రైలు దిగిన ఆయన, బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు.