రేపు విశాఖలో పర్యటించనున్న నారా లోకేశ్.. పర్యటన వివరాలు ఇవీ

  • విశాఖ విమానాశ్రయంలో స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు
  • రేపు ఉదయం వైజాగ్ కన్వెన్షన్‌‍లో జరగనున్న అర్థ సమృద్ధి కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న మంత్రి
  • భారత మహిళా క్రికెట్ జట్టుతో భేటీ కానున్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ రేపు(29-08-25) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేశ్‌కు ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

స్వాగతం పలికిన వారిలో హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు, పి.గణబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, మేయర్ పీలా శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. విమానాశ్రయంలో ప్రజలు, కార్యకర్తలను కలిసి లోకేశ్ అర్జీలు స్వీకరించారు.

మంత్రి నారా లోకేశ్ విశాఖ పర్యటన వివరాలు

ఉదయం

10.00 – 11.00: వైజాగ్ కన్వెన్షన్‌లో జరిగే అర్థ-సమృద్ధి 2025- ఐసీఏఐ నేషనల్ కాన్ఫరెన్‌లో పాల్గొంటారు.

11.30 – 12.15: విశాఖ చంద్రంపాలెం జడ్పీ హైస్కూల్‌లో ఏఐ ల్యాబ్స్‌ను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం

12.30 – 01.30: రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో ఏఐ ల్యాబ్స్‌ను వర్చువల్‌గా ప్రారంభిస్తారు.

03.00 – 04.00: విశాఖ నోవాటెల్ హోటల్‌లో ఏరోస్పేస్ మానుఫ్యాక్చరింగ్‌పై సీఐఐ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు.

సాయంత్రం

04.00 – 05.30: ఆంధ్రయూనివర్సిటీ కన్వెన్షన్ హాల్‌లో జరిగే స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొంటారు.

06.00 – 07.30: విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్‌లో భారత మహిళా క్రికెట్ జట్టుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.


More Telugu News