తెలంగాణలోని ఆ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ
- నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్
- ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన
- ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఉమ్మడి కరీంనగర్, మెదక్, వికారాబాద్ జిల్లాలకు అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.