లేహ్ లో చిక్కుకుపోయిన మాధవన్.. వర్షాలకు విమానాలు రద్దయ్యాయని వెల్లడి
- లఢఖ్ వచ్చిన ప్రతిసారీ ఇలాగే జరుగుతోందన్న నటుడు
- త్రీ ఇడియట్స్ సినిమా షూటింగ్ సందర్భంలోనూ ఇలాగే చిక్కుకుపోయానని వెల్లడి
- ఈ ప్రాంతం ఎలా ఉన్నప్పటికీ అందంగానే ఉంటుందని వ్యాఖ్య
జమ్మూకశ్మీర్ లో వర్షాల కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. దీంతో ప్రముఖ నటుడు మాధవన్ లేహ్ లో చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని ఆయన తన ఇన్ స్టా ఖాతాలో పంచుకున్నారు. వర్షాల కారణంగా విమానాలు రద్దవడంతో లేహ్ లోనే ఉండిపోవాల్సి వచ్చిందని, ఇది 17 ఏళ్ల నాటి సంగతిని గుర్తుచేసిందని చెప్పారు. తాను లఢఖ్ ను సందర్శించిన ప్రతిసారీ ఇలానే జరుగుతుందని చెప్పుకొచ్చారు.
2008లో త్రీ ఇడియట్స్ సినిమా షూటింగ్ కోసం లఢఖ్ వచ్చినప్పుడు కూడా ఇలానే జరిగిందని మాధవన్ చెప్పారు. అప్పుడు విపరీతంగా మంచు కురవడంతో విమానాశ్రయాలు మూసివేశారని వివరించారు. దీంతో షూటింగ్ కోసం వచ్చిన నటీనటుల బృందం మొత్తం ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిందని తెలిపారు. అయితే, ఈ ప్రాంతం ఎలా ఉన్నప్పటికీ అందంగానే ఉంటుందని వివరించారు.