తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

Telangana Rains Forecasted for Four More Days
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ రాష్ట్రంలో రాగల నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం హైదరాబాద్, హన్మకొండ, జగిత్యాల, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంగళవారం... భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ తదితర జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉంది.

బుధవారం... ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Go Back to Shorts
Telangana Rains
Telangana weather
Hyderabad weather
Rain alert
Yellow alert
IMD Hyderabad

More Telugu News