రాజస్థాన్ లో రాత్రికి రాత్రే ఏర్పడ్డ జలపాతం .. వీడియో ఇదిగో!

  • కుండపోత వర్షాలతో ఎడారి రాష్ట్రం అతలాకుతలం
  • సవాయ్ మాధోపూర్ జిల్లాలో భారీ విధ్వంసం
  • వరదలకు జలపాతాన్ని తలపించేలా 2 కి.మీ. మేర భారీ గుంత
కుండపోత వర్షాలకు రాజస్థాన్ లోని పలు జిల్లాల్లో భారీ విధ్వంసం జరిగింది. కోట, సవాయ్ మాధోపూర్, బుండి, ఝలావర్ జిల్లాల్లోని గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సవాయ్ మాధోపూర్, జడావట గ్రామాల్లో 2 కిలోమీటర్ల మేర 55 అడుగుల లోతు, 100 అడుగుల వెడల్పుతో భారీ బిలం ఏర్పడింది. ఇది ఓ జలపాతాన్ని తలపిస్తోంది. 

  గ్రామ శివార్లలో భూమి కోతకు గురై ఈ గుంత ఏర్పడింది. రెండు ఇళ్లు, రెండు దుకాణాలు, రెండు ఆలయాలు కొట్టుకుపోయాయి. ఈ గ్రామాలకు సమీపంలో ఉన్న సుర్వాల్ డ్యామ్ నిండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలను వరద ముంచెత్తింది. 


More Telugu News