Rajinikanth: కొత్త రికార్డును కొల్లగొట్టిన 'కూలీ'

Coolie Movie Update
షార్ట్స్‌లో చూడండి
రజనీకాంత్ కథానాయకుడిగా రూపొందిన 'కూలీ', ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అప్పటికి చాలా రోజుల ముందు నుంచి కూడా థియేటర్ల దగ్గర సందడి తగ్గింది. అలాంటి సమయంలో ఈ సినిమా మళ్లీ ఒక్కసారిగా థియేటర్లను నింపింది. అన్ని ప్రాంతాలలోని థియేటర్లు కళకళలాడాయి. తొలి రోజు నుంచే ఈ సినిమా తన రికార్డుల వేట మొదలుపెట్టింది. 

తొలి వారంలో ఈ సినిమా 444 కోట్లను కొల్లగొట్టింది. ఇక్కడివరకూ ఉన్న రికార్డులను ఈ సినిమా తుడిచిపెట్టేసింది. ఈ సినిమా 460 కోట్ల మార్క్ ను టచ్ చేస్తే మరి కొన్ని రికార్డులు పక్కకి తప్పుకుంటాయని చెబుతున్నారు. త్వరలోనే 500 కోట్ల మార్కును అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. తొలి మూడు రోజులలోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అదే ఊపు కొనసాగి ఉంటే, ఈ పాటికే ఆ మార్క్ ను అందుకుని ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాట అతధిక వసూళ్లను రాబట్టిన టాప్ 5 సినిమాల జాబితాలో రజనీకాంత్ నటించిన '2.0' .. 'జైలర్' ఉన్నాయి. ప్రస్తుతానికి 'కూలీ' టాప్ 6 ప్లేస్ కి వచ్చి చేరింది. త్వరలోనే టాప్ 5లో జాయిన్ కావొచ్చని అంటున్నారు. రజనీ ఫ్యాన్స్ ఒక వైపున కూలీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే, మరో వైపున 'జైలర్ 2' కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక మరో వైపున రజనీ - కమల్ కలిసి సినిమా చేయవచ్చనే ప్రచారం కూడా కోలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఇంతకాలంగా రజనీ - కమల్ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టేస్తారేమో చూడాలి. 

Go Back to Shorts
Rajinikanth
Coolie movie
Lokesh Kanagaraj
Jailer movie
Tamil cinema
Kollywood news
box office collections
Tamil Nadu
2.0 movie
Kamal Haasan

More Telugu News