చిరుకు సీఎం చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్

  • నేడు 70వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన మెగాస్టార్
  • చిరుకు సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల నుంచి జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌ల వెల్లువ
  • ఎక్స్ వేదిక‌గా చిరంజీవికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన చంద్ర‌బాబు
నేడు 70వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజ‌కీయ‌ ప్ర‌ముఖుల నుంచి పెద్ద ఎత్తున జ‌న్మ‌దిన‌ శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే చిరంజీవి సోద‌రుడు, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న అన్న‌య్య‌కి ప్రేమ పూర్వ‌కంగా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశారు. 

"మెగాస్టార్ చిరంజీవికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితం, దాతృత్వంలో మీ అద్భుతమైన ప్రయాణం లక్షలాది మందికి స్ఫూర్తి. మీ సేవ‌, అంకిత‌భావంతో ఇంకా ఎంద‌రో జీవితాలను ప్ర‌భావితం చేయాల‌ని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఆనందాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నాను" అని చంద్ర‌బాబు ట్వీట్ చేశారు. 


More Telugu News