స్వదేశానికి చేరుకున్న స్పేస్ హీరో శుభాంశు శుక్లా.. ఢిల్లీలో ఘన స్వాగతం

  • స్వాగతం పలికిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, సీఎం రేఖా గుప్తా, ఇస్రో చైర్మన్ నారాయణన్
  • నేడు ప్రధాని మోదీతో సమావేశం కానున్న శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కొద్దిసేపటి క్రితం భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా, ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తదితర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ సందర్భంగా శుక్లా విక్టరీ చిహ్నం చూపుతూ అందరికీ అభివాదం చేశారు. తన అనుభవాలను స్నేహితులు, సహచరులతో పంచుకోవడానికి ఆత్రుతతో ఉన్నానని నిన్న ఎక్స్ వేదికగా శుభాంశు శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే. యాక్సియం – 4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గత ఏడాది అమెరికా వెళ్లారు. మిషన్ విజయవంతమైన తర్వాత తొలిసారి భారత్‌కు వచ్చారు. ఈ రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో శుక్లా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొంటారు.


More Telugu News