మీడియా ఫొటోగ్రాఫర్లపై అలియా భట్ అసహనం.. వీడియో ఇదిగో!

––
బాలీవుడ్ ప్రముఖ నటి అలియా భట్ ఫొటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశారు. పికిల్ బాల్ గేమ్ ఆడేందుకు వెళ్లిన నటిని చూసి ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు. కారులో నుంచి దిగుతుండగా ఫొటోలు తీస్తున్నారు. అలియా భట్ లోపలికి వెళుతుండగా వెనకే అనుసరించారు. దీంతో అసహనానికి గురైన అలియా వెనక్కి తిరిగి.. “ప్లీజ్ మీకు లోపలికి అనుమతిలేదు. దయచేసి బయటకు వెళ్లండి” అంటూ గేట్ చూపించారు.

గేట్ లోపలికి రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఆపై నటి సహాయకుడు గేట్ వేయడంతో ఫొటోగ్రాఫర్లు బయటే నిలవగా.. అలియా లోపలికి వెళ్లిపోయారు. లోపల అలియా పికెల్ బాల్ గేమ్ ఆడుతుండగా గేటు దగ్గరి నుంచే వీడియోలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. నెటిజన్లు కూడా నటికి మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. అనుమతి లేకుండా ఫొటోలు తీసే అధికారం లేదని, మితిమీరిన స్వేచ్ఛ ఎప్పటికైనా ప్రమాదమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News