భారీ వర్షాలు.. బేగంబజారులో కుప్పకూలిన పురాతన భవనం

Begum Bazaar Old Building Collapses Due to Heavy Rains
  • ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం
  • భవనం శిథిలావస్థకు చేరుకుందని గతంలోనే నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ
  • నోటీసులు పట్టించుకోని యజమాని
హైదరాబాద్‌ నగరంలోని బేగంబజార్‌లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఒక పురాతన భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ భవనం శిథిలావస్థకు చేరుకున్నందున దానిని కూల్చివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు గతంలోనే భవనం యజమానికి నోటీసులు జారీ చేశారు.

జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ యజమాని పట్టించుకోలేదు. బేగంబజారులో ఇప్పటికీ చాలా మంది వ్యాపారులు ఇలాంటి పురాతన భవనాల్లోనే దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో శిథిలావస్థకు చేరుకున్న భవనాలను తొలగించాలని స్థానికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.
Go Back to Shorts
Begum Bazaar
Hyderabad rains
building collapse
GHMC
old building
Begum Bazaar shops
Hyderabad

More Telugu News