పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికలకు సర్వం సిద్ధం

  • పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో రేపుఎ ఉపఎన్నికలు
  • ఉదయం  7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌
  • ఎంపీడీఓ కార్యాల‌య్యాల్లో పోలింగ్ సామాగ్రిని పంపిణీ
  • ఈ రెండు జడ్పీటీసీ స్థానాల్లో 11 మంది చొప్పున అభ్య‌ర్థులు పోటీ
  • పోలింగ్ బూత్‌లు మార్చాలన్న వైసీపీ పిటిషన్ తిరస్కరణ
ఏపీలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాల్లో ఉపఎన్నికలకు మంగళవారం పోలింగ్ జరగనుంది. రెండు మండలాల్లో పోలింగ్  ఉదయం  7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జర‌గ‌నుంది. ఎంపీడీఓ కార్యాల‌య్యాల్లో పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.  

పులివెందులలో పోలింగ్ బూత్‌లన్నింటినీ సున్నితమైనవిగా ప్రకటించారు. అన్ని చోట్ల  వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయస్తున్నారు. ఒంటి మిట్టలో వెబ్‌కాస్టింగ్ లేని కేంద్రాల్లో మైక్రో-ఆబ్జర్వర్స్ ను నియమించారు. ఏపీఎస్‌పీ బాటాలియన్స్, డ్రోన్స్, క్లస్టర్ ఆధారిత పోలీస్ పర్యవేక్షణ, మొబైల్ సర్వైలెన్స్ వాహనాలతో సహా అన్ని స్థాయిల్లో భద్రతా  పటిష్ఠంగా చేశారు. 

ఇక‌, పులివెందుల జడ్పీటీసీలో 15 పోలింగ్ కేంద్రాల్లో సుమారు 10,601 ఓటర్లు, అలాగే ఒంటిమిట్ట మండలంలో  30 పోలింగ్ కేంద్రాల్లో 24,606 ఓటర్లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు. ఈ రెండు జడ్పీటీసీ స్థానాల్లో 11 మంది చొప్పున అభ్య‌ర్థులు పోటీ చేస్తున్నారు. కాగా,  పులివెందుల నుంచి వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ బ‌రిలో ఉన్నారు. 

పోలింగ్ బూత్‌లు మార్చాలన్న వైసీపీ పిటిషన్ తిరస్కరణ 
అంతకు ముందు పోలింగ్ బూత్‌లను వేరే చోట ఏర్పాటు చేశారంటూ హైకోర్టులో వైసీపీ వేసిన పిటిషన్ పై విచారమ జరిగింది.   ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  పోలింగ్ బూత్‌ల మార్పులో జోక్యాన్ని ఏపీ హైకోర్టు నిరాకరించింది.


More Telugu News