తెలంగాణకు నష్టం కల్గించే బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం: భట్టి విక్రమార్క
- సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఫిర్యాదుతో బనకచర్ల ప్రాజెక్టు అనుమతులు నిలిచిపోయాయన్న భట్టి
- రాయలసీమ ఎత్తిపోతల పథకాల వల్ల 25 రోజుల్లో శ్రీశైలం డ్యామ్ ఖాళీ అవుతుందన్న భట్టి
- రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేయాలన్న భట్టి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని, కాబట్టి ఆ ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కూడా ఏపీ ప్రభుత్వం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో బనకచర్ల ప్రాజెక్టు అనుమతులు నిలిచిపోయాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు గ్రామ సమీపంలోని వైరా నదిపై రూ.630 కోట్లతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ పోరిక బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి నిన్న భట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టులను సందర్శించి సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం రోజుకు 11 టీఎంసీల నీటిని ఆంధ్రాకు తరలిస్తే 25 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందని, దీని వల్ల నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.