పోలీసు సిబ్బందికి రాఖీ కట్టిన హోంమంత్రి

––
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు సిబ్బందికి రాఖీ కట్టారు. రక్షాబంధన్ సందర్భంగా శనివారం ఉదయం విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ నుంచి హోం మంత్రి ఆటోలో ఉషోదయ కాలనీ వరకూ ప్రయాణించారు.

ఈ మార్గంలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులను కలిసి రాఖీ కట్టి సోదరభావం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆటో డ్రైవర్ గిరీశ్ కు రాఖీ కట్టి ఆయన యోగక్షేమాలు విచారించారు.


More Telugu News