Supreetha: వాళ్లిద్దరికీ మాత్రం సిస్టర్ గా నటించలేను: సురేఖవాణి కుమార్తె సుప్రీత
- విజయ్ దేవరకొండ, అఖిల్‌కు సోదరిగా నటించనని చెప్పిన సుప్రీత
- పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ వంటి హీరోలకు సిస్టర్ పాత్రలు చేస్తానని వెల్లడి
- తప్పుడు డైటింగ్ వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నానని భావోద్వేగం
- ‘అమరావతికి ఆహ్వానం’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం
- ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సుప్రీత తొలి చిత్రం
సీనియర్ నటి సురేఖావాణి కుమార్తె సుప్రీత హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తన తొలి చిత్రం ‘అమరావతికి ఆహ్వానం’ ప్రమోషన్లలో భాగంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచి కథ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇద్దరు హీరోలకు మాత్రం మాత్రం చెల్లిగా నటించనని పేర్కొంది.
"పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లకు చెల్లిగా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. కానీ, విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేనిలకు మాత్రం సిస్టర్ గా చేయను" అని సుప్రీత స్పష్టం చేసింది. వాళ్లిద్దరూ అంటే తనకు చాలా ఇష్టమని, టెన్త్ క్లాస్ పాసయితే అఖిల్ తో డిన్నర్ కు తీసుకెళతానని అమ్మ మాటిచ్చిందని సుప్రీత వెల్లడించింది. కానీ ఇంతవరకు అది నెరవేరలేదని విచారం వ్యక్తం చేసింది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా విభిన్న పాత్రలు పోషించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపింది. సుప్రీత నటిస్తున్న ‘అమరావతికి ఆహ్వానం’ అనే హారర్ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదే ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న ఓ భయంకరమైన అనుభవాన్ని కూడా సుప్రీత పంచుకుంది. బరువు పెరిగావంటూ చుట్టూ ఉన్నవారు అనడంతో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యానని, దాంతో బరువు తగ్గాలని తప్పుడు డైటింగ్ పద్ధతులు పాటించానని సుప్రీత భావోద్వేగంతో చెప్పింది. "ఒత్తిడి పెరిగినప్పుడల్లా ఇంకా ఎక్కువ తినేదాన్ని. దాంతో లావయ్యాను. వెంటనే బరువు తగ్గాలని నిర్ణయించుకుని, రోజుకు ఒక పూట మాత్రమే తినడం మొదలుపెట్టా. సుమారు 12 నుంచి 15 గంటలు ఏమీ తినకుండా ఉండేదాన్ని. బిర్యానీలు తినడంతో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది" అని ఆమె వివరించారు.
ఆరోగ్య సమస్యలు తీవ్రం కావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని, అక్కడ 15 రోజుల పాటు నరకం చూశానని కన్నీటిపర్యంతమయ్యారు. "మంచినీళ్లు తాగినా వాంతులయ్యేవి. దాదాపు 20 రోజులు అన్నం తినలేదు. రోజుకు 15 సార్లు వాంతులు చేసుకున్నా. ఒక దశలో నేను బతకనేమో అనుకున్నా. ఈ బాధ భరించడం కన్నా చనిపోవడం మంచిదనిపించింది. కానీ దేవుడి దయతో కోలుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను" అని సుప్రీత తెలిపింది. తన అనుభవం అందరికీ ఒక గుణపాఠం కావాలని, ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దని ఆమె సూచించారు.