భార్యపై అనుమానంతో భర్త దారుణం.. ఇన్ స్టాలో భార్య అసభ్యకర ఫొటోలు.. సికింద్రాబాద్ లో దారుణం

––
భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త అత్యంత నీచానికి పాల్పడ్డాడు. భార్య అసభ్యకర ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటు చేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన భీంరాజ్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించి మూడు నెలల క్రితం ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నాడు. మద్యానికి బానిసైన భీంరాజ్‌ ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ కారణంగా రోజూ ఆమెను వేధింపులకు గురిచేస్తున్నాడు.

భార్యకు సంబంధించిన ప్రైవేట్ ఫొటోలను ఇన్ స్టాలో అప్ లోడ్ చేసి అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు పుట్టింటికి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసింది. ఫినాయిల్‌ తాగడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భీంరాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.


More Telugu News