ఈటీవీ సుమన్ గారిని కాకాపట్టడానికి నేనెప్పుడూ ట్రై చేయలేదు: నటుడు ఇంద్రనాగ్
- 2004లో ఇండస్ట్రీకి వచ్చానన్న ఇంద్రనాగ్
- సుమన్ గారు తనని తమ్ముడిలా చూశారని వెల్లడి
- ప్రభాకర్ గారితో గొడవలు లేవని వివరణ
- కాకపోతే తనపై ఆయనకి కోపం ఉందని వ్యాఖ్య
ఒకప్పుడు ఈటీవీలో సుమన్ భారీ ధారావాహికలను పరుగులు తీయించారు. సినిమా పాటలతో సమానంగా ఆయన సీరియల్స్ లోని పాటలు పాప్యులర్ అయ్యేవి. రచయితగా తనని తాను నిరూపించుకున్న సుమన్, తన చివరి రోజులలో నటుడిగానూ తనకి గల కోరికను నెరవేర్చుకున్నారు. ఆ సమయంలో ఆయనతో సన్నిహితంగా ఉన్న ఇంద్రనాగ్, ఆ తరువాత అనేక విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఆ విషయాలను గురించి తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రనాగ్ ప్రస్తావించారు. "2004లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఈటీవీ సీరియల్స్ చేస్తున్నప్పటికీ, సుమన్ గారిని నేను నేరుగా కలిసింది 2008 చివరిలోనే. ఆ తరువాత నుంచి ఆయన నన్ను ఒక తమ్ముడిగా చూసుకునేవారు. అప్పుడు ప్రభాకర్ గారు క్రియేటివ్ హెడ్ గా ఉండేవారు. అయితే ఆయనతో ఒక ఫ్రెండ్లీ జర్నీ అయితే ఉండేది కాదు. కానీ ఆయనకి నాపై కోపం ఉందనే విషయం ఆయనిచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది" అని అన్నారు.
"సుమన్ గారు నాతో ఎంతో చనువుగా ఉండేవారు. నాతో పాటు ఆయన మా ఊరు వచ్చారు... మా పొలాలలో తిరిగారు. అలాంటి సుమన్ గారికి నేను ప్రభాకర్ గారి గురించి ఏదో చెప్పానని ప్రభాకర్ గారు అనుకుని ఉండొచ్చు. సుమన్ గారితో ప్రభాకర్ గారికి గల అనుబంధాన్ని నేనే కట్ చేశానని భావించి ఉండొచ్చని నాకు అనిపించింది. సుమన్ గారిని కాకా పట్టడానికి నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఆయన నుంచి ఏదో దండుకోవాలనే ఆలోచనా చేయలేదు. అందువల్లనే ఇప్పటికీ ఈటీవీతో నా జర్నీ కొనసాగుతోంది" అని చెప్పారు.