: తమిళ హీరో, టీవీకే చీఫ్ విజయ్ కు కోర్టులో చుక్కెదురు
- ట్యాక్స్ పెనాల్టీ రూ.1.5 కోట్లు చెల్లించాల్సిందేనన్ని కోర్టు
- 2015–16 ఏడాది పన్ను చెల్లింపులపై ఐటీ శాఖ ఫైన్
- విజయ్ అప్పీల్ ను తోసిపుచ్చిన మద్రాస్ హైకోర్టు
ప్రముఖ తమిళ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ కు కోర్టులో చుక్కెదురైంది. ఆదాయపు పన్ను శాఖ విధించిన ట్యాక్స్ పెనాల్టీని రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. రూ.1.5 కోట్ల పెనాల్టీని చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు వెలువరించింది. 2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ తన ఆదాయాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపించారని ఆదాయపు పన్ను శాఖ ఆరోపించింది.
అప్పట్లో విడుదలైన పులి సినిమాకు తీసుకున్న పారితోషికాన్ని తగ్గించి చూపారని పేర్కొంది. ఆ సినిమాకు రూ.15 కోట్లు పారితోషికంగా విజయ్ అందుకున్నారని, అందులో రూ.5 కోట్లను నగదు రూపంలో తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా ఆదాయపు పన్ను ఎగ్గొట్టారని ఆరోపించారు. శాఖాపరమైన దర్యాప్తులో ఈ విషయం తేలడంతో విజయ్ కు ఆదాయపు పన్ను శాఖ రూ.1.5 కోట్ల పెనాల్టీ విధించింది.
ఈ పెనాల్టీని రద్దు చేయాలంటూ విజయ్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు గత నెల 23న తీర్పు రిజర్వు చేసింది. ఈ రోజు ఉదయం తీర్పు వెలువరిస్తూ.. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల పెనాల్టీని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.