‘వార్2’ నుంచి రొమాంటిక్‌ సాంగ్‌ విడుద‌ల‌

  • హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో ‘వార్2’ 
  • య‌శ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాణం.. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం
  • ఆగ‌ష్టు 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న మూవీ
  • ఈ నేప‌థ్యంలో సినిమా నుంచి వ‌రుస అప్‌డేట్స్ ఇస్తున్న మేక‌ర్స్ 
  • తాజాగా ‘ఊపిరి ఊయలగా’ అంటూ సాగే రోమాంటిక్ సాంగ్ రిలీజ్‌
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌, టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు జూనియ‌ర్‌ ఎన్టీఆర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం వార్ 2. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ య‌శ్‌రాజ్ ఫిల్మ్స్‌ బ్యాన‌ర్‌పై అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా న‌టిస్తున్నారు. స్పై యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న‌ ఈ చిత్రం ఆగ‌ష్టు 14న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానున్న‌ విష‌యం తెలిసిందే. 

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ సినిమా నుంచి వ‌రుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఇప్ప‌టికే మూవీ నుంచి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన చిత్ర బృందం తాజాగా ‘ఊపిరి ఊయలగా’ అంటూ సాగే రోమాంటిక్ సాంగ్‌ని విడుద‌ల చేసింది. హృతిక్‌, కియారాల మధ్య వ‌చ్చే ఈ పాట‌ ప్ర‌స్తుతం ఆక‌ట్టుకుంటుంది. తెలుగు పాట‌కు చంద్ర‌బోస్ లిరిక్స్ అందించ‌గా.. శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ పాడారు.



More Telugu News