నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి జీఎస్ఎల్వీ-ఎఫ్16... విజయవంతంగా కక్ష్యలోకి 'నైసార్'
- నాసా, ఇస్రో సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం నైసార్
- నైసార్ ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్16
- ప్రయోగం విజయవంతమైందన్న ఇస్రో
నైసార్ అంటే నాసా ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్. ఇందులో ఉండే రెండు భారీ డిష్ ల వంటి నిర్మాణాలు భూమిపైకి మైక్రోవేవ్, రేడియో వేవ్ సంకేతాలు పంపుతాయి. ఆ సంకేతాలు భూమిని తాకి పరావర్తనం చెంది తిరిగి శాటిలైట్ ను చేరతాయి. నైసార్ లోని సాంకేతిక వ్యవస్థలు ఆ సంకేతాలను విశ్లేషించి చిత్రాలుగా రూపొందిస్తాయి.
ప్రకృతి విపత్తులను ఇది ముందుగానే అత్యంత కచ్చితత్వంతో అంచనా వేస్తుందని భావిస్తున్నారు. ఇస్రో అత్యంత చవకగా రాకెట్ ప్రయోగాలు చేపట్టడం గమనించిన నాసా... ఈ ఉపగ్రహ ప్రయోగం కోసం ఇస్రోతో జట్టుకట్టింది.