రేపు జగన్ పర్యటన ముగిశాక కాకాణి దుర్మార్గాలు బయటపెడతా: సోమిరెడ్డి

  • రేపు నెల్లూరు వస్తున్న వైసీపీ అధినేత జగన్
  • జైల్లో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్న వైనం
  • జగన్ మాట విని ఎంతమంది జైలు పాలయ్యారన్న సోమిరెడ్డి 
  • వారిని కూడా జగన్ పరామర్శించాలని డిమాండ్
వైసీపీ అధినేత జగన్ రేపు నెల్లూరు పర్యటనకు వస్తుండడంపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. జగన్ ఏ ముఖం పెట్టుకుని నెల్లూరు వస్తున్నారని నిలదీశారు. 

జగన్ మాట విని ఎంతోమంది అధికారులు ఊచలు లెక్కపెట్టారని, జగన్ వారిని పరామర్శించకుండా, కాకాణిని పరామర్శించేందుకు నెల్లూరుకు ఎందుకు వస్తున్నట్టు అని ప్రశ్నించారు. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లిన మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి, ధనంజయరెడ్డిలను కూడా జగన్ పరామర్శించాలని అన్నారు. 

"కాకాణి అక్రమాలతో ఎంతోమంది అధికారులు సస్పెన్షన్ వేటుకు గురయ్యారు... అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు... రేపు జగన్ పర్యటన ముగియగానే కాకాణి దుర్మార్గాలన్నీ బయటపెడతా" అని హెచ్చరించారు. కాకాణి పాపాలకు బలైన వారిని కూడా జగన్ పరామర్శించాలని సోమిరెడ్డి స్పష్టం చేశారు. 


More Telugu News