బంధువుల పెళ్లిలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు క్రేజీ డ్యాన్స్... వీడియో ఇదిగో!
- శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడి బంధువుల పెళ్లి
- హాజరైన రామ్మోహన్ నాయుడు
- డ్యాన్స్ వీడియోలు వైరల్
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బంధువుల పెళ్లిలో తన డ్యాన్స్ తో అందరినీ అలరించారు. శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు బంధువుల ఇంట ఓ వివాహ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రామ్మోహన్ నాయుడు కూడా విచ్చేశారు. బంధుమిత్రులతో కలిసి వేదిక ఎక్కిన ఆయన... ఉత్సాహంగా కాలు కదిపారు. మాంచి హుషారైన పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.