నాలుగో టెస్టు ఆఖ‌ర్లో ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న‌.. ఇంగ్లండ్ కెప్టెన్‌కు జ‌డ్డూ అదిరిపోయే స‌మాధానం.. ఇదిగో వీడియో!

  • మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు డ్రా
  • మ్యాచ్ ఆఖ‌ర్లో ఇంగ్లండ్ ఆట‌గాళ్ల తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు
  • సుంద‌ర్, జ‌డేజా సెంచ‌రీల‌కు చేరువైన స‌మ‌యంలో స్టోక్స్ మ్యాచ్ డ్రా కోసం ప్ర‌య‌త్నం
  • మ్యాచ్ డ్రా చేసుకునేందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాల‌ని భార‌త ప్లేయ‌ర్ల‌పై ఒత్తిడి
  • అందుకు నిరాక‌రించ‌డంతో జ‌డ్డూపై స్టోక్స్ వ్యంగ్యాస్త్రాలు
మాంచెస్ట‌ర్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన విష‌యం తెలిసిందే. భార‌త ఆటగాళ్లు వీరోచితంగా పోరాడిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అయితే, మ్యాచ్ ఆఖ‌ర్లో ఇంగ్లండ్ ఆట‌గాళ్ల తీరుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వాషింగ్ట‌న్‌ సుంద‌ర్, ర‌వీంద్ర జ‌డేజా సెంచ‌రీల‌కు చేరువైన స‌మ‌యంలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ్యాచ్ డ్రా చేసుకునేందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాల‌ని కోరాడు. దానికి మిగ‌తా ఆట‌గాళ్లు సైతం జ‌డ్డూ, సుంద‌ర్‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చారు. 

అయితే, ఆ ప్ర‌తిపాద‌న‌కు భార‌త ప్లేయ‌ర్లు నిరాక‌రించారు. దాంతో స్టోక్స్‌తో పాటు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. "బ్రూక్‌, డ‌కెట్ బౌలింగ్‌లో సెంచ‌రీ చేద్దామ‌నుకుంటున్నావా" అంటూ స్టోక్స్.. జ‌డేజాతో వెట‌కారంగా మాట్లాడాడు. అత‌నికి జ‌డ్డూ త‌న‌దైన‌శైలిలో స‌మాధానం ఇచ్చాడు. 

ఇలా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఇంగ్లండ్ ఆట‌గాళ్లు ప్ర‌వ‌ర్తించిన తీరుపై క్రీడా విశ్లేష‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. త్వ‌ర‌గా సెంచ‌రీలు చేసేసి వెళ్లిపోండి అన్న‌ట్లు బ్రూక్‌, రూట్ బౌలింగ్ చేసిన తీరును కూడా ఎండ‌గ‌డుతున్నారు. ఇక‌, చివ‌రి వ‌ర‌కు క్రీజులో నిల‌బ‌డి భార‌త్‌ను గట్టేక్కించిన సుంద‌ర్‌, జ‌డేజా అజేయ శ‌త‌కాల‌తో ఇంగ్లండ్ ప్లేయ‌ర్ల‌కు గ‌ట్టి స‌మాధానం చెప్పారు.  


More Telugu News