థాయ్‌లాండ్‌, కంబోడియా మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌పై ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

  • మరోసారి శాంతి దూతగా మారిన ట్రంప్
  • థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య గత మూడు రోజులుగా ఘర్షణలు
  • ఇరు దేశాల మ‌ధ్య ఘ‌ర్ణ‌ణ‌ల‌కు త్వరలోనే ముగింపు అన్న ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తన మధ్యవర్తిత్వంతోనే పాక్‌, భారత్‌ మధ్య కాల్పులు నిలిచాయని పదేపదే చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయ‌న‌ మరోసారి శాంతి దూతగా మారారు. థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య గత మూడు రోజులుగా జరుగుతున్న ఘర్షణలకు త్వరలోనే ముగింపు పడనుందని ట్రంప్ ప్ర‌క‌టించారు. ఇరు దేశాలు తక్షణ కాల్పుల విరమణ చర్చలకు అంగీకరించాయన్నారు. 

ప్రస్తుతం కంబోడియా పర్యటనలో ఉన్న ఆయన ఇరు దేశాధినేతలతో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలిపారు. ఘర్షణలు ఇలాగే కొనసాగితే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు ప్రమాదంలో పడతాయని ఇద్దరినీ హెచ్చరించానని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోష‌ల్‌ వేదికగా ప్రకటించారు. దాంతో రెండు దేశాలు దారికి వ‌చ్చాయ‌ని తెలిపారు. దెబ్బ‌కు దిగొచ్చి శాంతి చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించాయ‌ని త‌న పోస్టులో పేర్కొన్నారు. 

థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య ఘర్షణలు.. 32 మంది మృతి
కాగా, థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య ఘర్షణలు శనివారం మూడవ రోజుకు చేరుకున్నాయి. ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య 32కి చేరుకుంది. 1,30,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఐక్యరాజ్యసమితికి చెందిన భద్రతా మండలి శుక్రవారం న్యూయార్క్‌లో రహస్యంగా అత్యవసర సమావేశం నిర్వహించి థాయ్‌-కంబోడియా తాజా ఘర్షణలపై చర్చలు జరిపింది. 

కాగా, ఘర్షణ పడుతున్న రెండు దేశాలతో పాటు 10 ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ప్రాంతీయ సంఘం ఆసియన్‌కి సారథ్యం వహిస్తున్న మలేషియా కాల్పుల విరమణ జరపాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చింది.



More Telugu News