అబ్దుల్ కలాంకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

  • శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు డాక్టర్ అబ్దుల్ కలాం అని పేర్కొన్న సీఎం చంద్రబాబు
  • ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందామన్న సీఎం
  • అబ్దుల్ కలాం ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషిచేద్దామన్న మంత్రి లోకేశ్ 
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా నివాళులర్పించారు. శాస్త్రవేత్తగా దేశ అణు, శాస్త్రీయ రంగాలకు మార్గనిర్దేశం చేసిన దార్శనికుడు, ప్రజల రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత మానవతావాది సేవలను స్మరించుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషి చేద్దాం: లోకేశ్

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి అబ్దుల్ కలాం. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గడించారన్నారు. శాస్త్రవేత్తగా దేశానికి ఆయన అందించిన సేవలు నిరుపమానం అని శ్లాఘించారు. తనదైన వ్యక్తిత్వం, ప్రసంగాలతో లక్షలాది మందిలో స్ఫూర్తి నింపారన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరం కృషి చేద్దామని నారా లోకేశ్ పిలుపునిచ్చారు. 


More Telugu News