Rajnath Singh: కర్నూలు జిల్లాలో డ్రోన్ నుంచి క్షిపణి పరీక్ష.. ట్వీట్ చేసిన రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh Announces Drone Missile Test in Kurnool District
షార్ట్స్‌లో చూడండి
డ్రోన్ నుండి క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈ పరీక్ష ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో గల నేషనల్ ఓపెన్ ఏరియా రేంజి (ఎన్ఓఏఆర్)లో జరిగింది. ఈ ప్రయోగానికి సంబంధించిన ఫొటోను ఆయన 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు.

డీఆర్డీఓ, ఈ క్షిపణి అభివృద్ధి మరియు తయారీలో భాగస్వాములైన ఎంఎస్ఎంఈలు, స్టార్టప్స్‌‌లను రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. సంక్లిష్టమైన సాంకేతికతను అర్థం చేసుకోవడంతో పాటు ఉత్పత్తి చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఈ పరీక్ష నిరూపించిందని ఆయన పేర్కొన్నారు.

దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని యూఏవీ లాంచ్‌డ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ (యూఎల్‌పీజీఎం)-వీ3గా వ్యవహరిస్తున్నారు. అయితే, దీని సాంకేతిక వివరాలను వెల్లడించలేదు. గతంలో డీఆర్డీవో పత్రాలు, బహిరంగ సమాచారం ప్రకారం గతంలో పరీక్షించిన యూఎల్‌పీజీఎం-వీ2 వేదికపైనే దీనిని అభివృద్ధి చేశారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని డీఆర్డీవోకు చెందిన ఎన్ఓఏఆర్ పరీక్ష కేంద్రాన్ని దీని కోసం ఎంచుకున్నారు. గతంలో కూడా ఇక్కడ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ వ్యవస్థను పరీక్షించేందుకు ఇదే వేదికను ఉపయోగించారు. ఈ ఆయుధం ఫిక్స్‌డ్‌వింగ్ మానవరహిత విమానాలను కూల్చివేయడానికి ఉపయోగిస్తారు.
Go Back to Shorts
Rajnath Singh
Kurnool
DRDO
Missile test
Drone missile
ULPGM V3
National Open Area Range

More Telugu News