చంద్రబాబు, లోకేశ్ లకు కృతజ్ఞతలు: విశాఖలో పవన్ కల్యాణ్
- రేపు హరిహర వీరమల్లు రిలీజ్
- విశాఖలో ఈవెంట్... హాజరైన పవన్ కల్యాణ్
- ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారని వెల్లడి
- సినిమా విజయవంతం కావలంటూ లోకేశ్ పోస్టు పెట్టారని వివరణ
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు రేపు (జులై 24) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. తన సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు చంద్రబాబు అవకాశం ఇచ్చారని, అలాగే, ఈ చిత్రం విజయం సాధించాలంటూ లోకేశ్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని పవన్ వివరించారు.
ఇక, పవన్ ఎక్కడికెళితే అక్కడే పుట్టాను అని చెప్పుకుంటాడు అంటూ కొందరు విమర్శిస్తుంటారని, వారు బావిలో కప్పల వంటి వారని,చ వారు అంతకుమించి ఆలోచించలేరని విమర్శించారు. తన పేరులోనే పవన్ (గాలి) అని ఉందని, తాను ఎక్కడైనా ఉంటానని అన్నారు.
శాఖ నగరంతో తనకు మంచి అనుబంధం ఉందని, తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చేముందు ఇక్కడే నటనలో ఓనమాలు దిద్దుకున్నానని వెల్లడించారు. బాల్యం నుంచి తనకు పెద్ద కోరికలంటూ ఏవీ ఉండేవి కావని, కానీ ఎక్కడైనా అన్యాయం జరిగితే తిరగబడాలని అనిపించేదని చెప్పారు. సినిమాల్లోకి వచ్చి డబ్బు సంపాదించాలని ఎప్పుడూ అనుకోలేదని, ఓ దశలో నటన కన్నా ఫిలిం మేకింగ్ పైనే ఎక్కువ ఆసక్తి ఏర్పడిందని పవన్ వివరించారు.
తన దృష్టిలో కనిపించే దైవాలు అంటే అన్నా వదినలేనని, వాళ్లిద్దరూ తనను నమ్మారని వెల్లడించారు.
ఇక హరిహర వీరమల్లు గురించి చెబుతూ, ఈ చిత్రానికి ఆద్యుడు క్రిష్ అని స్పష్టం చేశారు. ఈ కథను తీర్చిదిద్ది 30 శాతం షూటింగ్ కూడా చేశారని వివరించారు. క్రిష్ వ్యక్తిగత కారణాలతో ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నా, జ్యోతికృష్ణ ఈ సినిమాను గట్టిగా ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. క్రిష్ విడుదల చేసిన టీజర్ తో ఈ సినిమాపై ఉన్న సందేహాలన్నీ కొట్టుకుపోయాయని అన్నారు.