విమానాల స్విచ్‌లలో ఎలాంటి సమస్యను గుర్తించలేదు: ఎయిరిండియా

  • డీజీసీఏ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టిన ఎయిరిండియా
  • ప్రకటన విడుదల చేసిన ఎయిరిండియా సంస్థ
  • డీజీసీఏ సూచించిన వ్యవధిలో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడి
ఎయిరిండియా సంస్థ తమ విమానాల్లోని ఇంధన స్విచ్‌ల వ్యవస్థలపై ప్రకటన విడుదల చేసింది. తమ వద్ద ఉన్న బోయింగ్ 787, 737 విమానాల ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థల్లో ఎలాంటి సమస్యలను గుర్తించలేదని ఆ ప్రకటనలో పేర్కొంది.

గత నెలలో అహ్మదాబాద్‌లో ఇంధన స్విచ్‌ల కారణంగా ఒక విమానం కూలిన సంఘటన నేపథ్యంలో, డీజీసీఏ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపింది. భారతదేశంలో రిజిస్టర్ అయిన బోయింగ్ విమానాలన్నింటిలో జులై చివరి నాటికి ఈ తనిఖీలు పూర్తి చేయాలని డీజీసీఏ ఆదేశించింది.

ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన ఎయిరిండియా సంస్థ, బోయింగ్ విమానాల ఇంధన స్విచ్‌ల లాకింగ్ వ్యవస్థల్లో ముందు జాగ్రత్త చర్యగా చేపట్టిని తనిఖీలను పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ తనిఖీలలో ఎటువంటి సమస్యను గుర్తించలేదని స్పష్టం చేసింది. జులై 12న ప్రారంభమైన ఈ తనిఖీలు, డీజీసీఏ సూచించిన గడువులోగా పూర్తయ్యాయని, ఈ విషయాన్ని డీజీసీఏకు తెలియజేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది.


More Telugu News