నేడు పోలీసుల ఎదుట హాజరుకానున్న అంబటి రాంబాబు, విడదల రజని

  • జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై కేసు
  • పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు
  • అంబటి, విడదల రజనిలకు పోలీసుల నోటీసులు
వైసీపీ మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజని ఈరోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరుకానున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా అంబటి, విడదల రజని పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో వీరిపై కేసు నమోదయింది. ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ వీరికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిని తగిన ఆధారాలతో పోలీసులు విచారించనున్నారు. వీరి విచారణ నేపథ్యంలో సత్తెనపల్లిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

మరోవైపు, వైసీపీ నేతలను వరుస కేసులు వెంటాడుతున్నాయి. లిక్కర్ స్కామ్ లో ఎంపీ మిథున్ రెడ్డిని తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో వైసీపీ అధినేత జగన్ పేరును కూడా సిట్ అధికారులు పలుమార్లు ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ కేసు విచారణ ఎలాంటి కీలక మలుపులు తీసుకుంటుందోననే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది.


More Telugu News