అంబర్ పేట మహాకాళి ఆలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- హైదరాబాదులో బోనాల సంబరం
- అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి కుటుంబం
- భక్తులతో కలిసి ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న కిషన్ రెడ్డి
అంబర్‌పేటలోని శ్రీ మహాకాళి ఆలయంలో జరుగుతున్న బోనాల జాతర సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదివారం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల ఉత్సవం శాంతియుతంగా, భక్తిభావంతో జరగాలని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులతో కలిసి ఆయన ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తో పాటు దేవస్థాన సేవా సమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.
కిషన్ రెడ్డి ఇవాళ మల్లేపల్లి కట్ట మైసమ్మ ఆలయం, కాచిగూడ నింబోలి అడ్డ మహంకాళి ఆలయం, హిమాయత్ నగర్ విఠలవాడి ముత్యాలమ్మ మహాంకాళి ఆలయం, మల్లేపల్లి ఎల్లమ్మ గుడి, కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ తల్లి ఆలయం, మెహిదీపట్నం కనకదుర్గ ఆలయాలను సందర్శించారు. షేక్ పేట, ఇంద్రా నగర్, రహమత్ నగర్, యూసుఫ్ గూడ, బేగంపేట, చిలకలగూడ, బుద్ద నగర్ తదితర ప్రాంతాల్లో జరిగిన బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.
బోనాల జాతర హైదరాబాద్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటిగా భావిస్తారు, ఇది భక్తులను ఆకర్షిస్తూ సాంప్రదాయ వైభవంతో జరుగుతోంది.