Mumbai Mayor Election: ముంబై మేయర్ ఎన్నికపై వీడిన పీటముడి.. బీజేపీ అభ్యర్థికే పట్టం!

Ritu Tawde Elected as Mumbai Mayor Ending Suspense
షార్ట్స్‌లో చూడండి
ముంబై మేయర్ ఎన్నికపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. సుదీర్ఘ చర్చల తర్వాత రోజుల తరబడి నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది. బీజేపీ, శివసేన షిండే పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మేయర్ సీటు బీజేపీకి, డిప్యూటీ మేయర్ సీటును శివసేనకు ఇచ్చేటట్లు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మహాయుతి కూటమి వర్గాలు ప్రకటించాయి. దీంతో మేయర్ అభ్యర్థిగా ఘట్ కోపర్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందిన రీతూ తావ్డేను బీజేపీ తన అభ్యర్థిగా ఎంపిక చేసింది. పాతికేళ్లుగా ముంబై మేయర్ సీటులో శివసేన పార్టీ అభ్యర్థే ఉండేవారు. తాజాగా ఇప్పుడు మేయర్ సీటు బీజేపీ దక్కించుకుంది. శివసేన (షిండే) పార్టీ.. డిప్యూటీ మేయర్ సీటుతో సరిపెట్టుకుంది.

5వ వార్డు నుంచి గెలిచిన సంజయ్ శంకర్ ఘాడీని డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. డిప్యూటీ మేయర్ పదవికి పార్టీలోని నలుగురు అభ్యర్థులకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. దీంతో సంజయ్ శంకర్ ఘాడీ వచ్చే 15 నెలల పాటు డిప్యూటీ మేయర్ గా కొనసాగుతారని, ఆ తర్వాత మరో అభ్యర్థిని శివసేన ఆ సీట్లో కూర్చోబెడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Go Back to Shorts
Mumbai Mayor Election
BJP
Shiv Sena Shinde
Ritu Tawde
BMC Elections
Sanjay Shankar Ghadi
Mumbai Politics
Ghatkopar
Deputy Mayor

More Telugu News