Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ హైకమాండ్ చెబితే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తా: రాజాసింగ్

Raja Singh Ready to Resign as MLA if BJP High Command Asks
Advertisement
  • పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న రాజాసింగ్
  • ఇటీవలే బీజేపీకి రాజీనామా
  • ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వైనం
Advertisement
కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేయడం తెలిసిందే. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ హైకమాండ్ చెబితే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని అన్నారు. బీజేపీ పెద్దల నిర్ణయాన్ని పాటిస్తానని తెలిపారు. 

ఇవాళ బోనాల సందర్భంగా నగరంలోని సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజాసింగ్, అనంతరం మీడియాతో మాట్లాడారు. గోషామహల్ అంటే బీజేపీ అడ్డా అని, ఇక్కడ ఉప ఎన్నిక వచ్చినా తనకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. ఎవరు పోటీ చేసినా తానేమీ బాధపడనని స్పష్టం చేశారు. అంతేగాకుండా, తాను ఏ పార్టీలోకి వెళ్లనని అన్నారు. 
Advertisement
Advertisement
Raja Singh
Raja Singh BJP
Goshamahal MLA
Telangana BJP
BJP High Command
Simhavahini Mahankali
Bonala Festival Hyderabad
Telangana Politics
BJP Telangana

More Telugu News